మెదక్ జిల్లాలో కంటైనర్‌లో మంటలు.. కొత్త కార్లు దగ్ధం
- కంటైనర్‌లోని ఎనిమిది కార్లు దగ్ధం
- తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కంటైనర్ కు మంటలు
- జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో కంటైనర్‌లో మంటలు చెలరేగి కొత్త కార్లు దగ్దమయ్యాయి. 8 కొత్త కార్లతో కూడిన కంటైనర్ కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళుతోంది. తూప్రాన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై అకస్మాత్తుగా మంటలు వచ్చి కంటైనర్ కాలిపోయింది. ఈ ఘటనలో అందులోని పది కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లారీలో కొత్తగా తరలిస్తున్న ఎనిమిది మారుతీ కార్లు ఉన్నాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించి కంటైనర్‌తో పాటు అన్ని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కంటైనర్ దగ్దం కావడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. కానీ అప్పటికే కంటైనర్, కార్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ఈ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.